కేరళ కౌంటింగ్: తొలి ట్రెండ్స్‌లో దూసుకెళ్తున్న యూడీఎఫ్

  • కేరళ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యం
  • 51 స్థానాల్లో కాంగ్రెస్, 27 స్థానాల్లో సీపీఎం ముందంజ
  • మధ్యాహ్నానికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 43 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 కేంద్రాల్లో అధికారులు లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. వెలువడుతున్న ప్రాథమిక సరళి ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఎన్నికల సంఘం విడుదల చేసిన తొలి ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 51 స్థానాల్లో ముందంజలో ఉంది. యూడీఎఫ్ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 15 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) కూటమిలో సీపీఎం 27 స్థానాల్లో, సీపీఐ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఎన్నికల పరిశీలకులు, భద్రతా సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. మొత్తం పోలైన ఓట్లలో 1.36% పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి.

ఏప్రిల్ 9న జరిగిన ఈ ఎన్నికల్లో అధికార ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Kerala Assembly Elections
Kerala Elections 2026
UDF
LDF
Indian Union Muslim League
CPM
CPI
Kerala Election Results
Kerala Political News

More Telugu News